టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో దర్యాప్తుని చాలా వేగవంతం చేస్తున్నారు పోలీసులు.. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.. దీంతో నిందితుల సంఖ్య 14కి చేరింది.. పరారీలో ఉన్న శ్వేత , లిషి నిల్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.. డ్రగ్స్ సప్లై పైన ఆరా తీసీ పోలీసులు సైతం ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసి పలు రకాల కోణాలలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు కూడా బయటికి రావడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు క్రిష్ పేరు బయటకు రావడంతో ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు.. డ్రగ్స్ కేసులో తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ విచారణకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి రావాలని ఆశ్రయించారు పోలీసులు.. కానీ ఆయన హైకోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.. హైకోర్టులో క్రిష్ ముందస్తు బెయిల్ పై విచారణ జరుపుతున్నారు.. డ్రగ్స్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది క్రిష్.


ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల తనని కూడా నిందితుడిగా చేర్చారంటు వాపోతున్నారు.. నేను డ్రగ్స్ తీసుకోవడానికి గల ఆధారాలు లేవని కావాలనే తనను ఈ కేసులో ఇరికించారంటూ కూడా వెల్లడించారు. అయితే డ్రగ్స్ కేసు వివరాలు సమర్పించాలని పోలీసులు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.. పోలీసు విచారణకు సహకరిస్తారన్న డైరెక్టర్ అనూహ్యంగా కోర్టులో ఫిర్యాదు చేయడంతో పాటు ముందస్తు బెయిల్ కీ పిటిషన్ వేశారు.. డ్రగ్స్ కేసు తీగ ఎప్పుడు లాగినా కూడా ఇందులో చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో కూడా చాలామంది డ్రక్స్ కేసులో సినీ సెలబ్రిటీల పేర్లు వినిపించాయి.. ఇప్పుడు ఈ రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో మరి ఎంతమంది పేర్లు బయటికి వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: