సామాన్య ప్రజల లాగానే అటు సెలబ్రిటీలకు కూడా ఎన్నో బలాలు బలహీనతలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే బలాల గురించి అందరికీ తెలిసేలా చేసిన.. బలహీనతల గురించి మాత్రం సెలబ్రిటీలు బయటికి చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఏ విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాగే సామాన్యులు వాడినట్లుగానే సెలబ్రిటీలు సైతం ఇక తమకు నచ్చిన ఊత పదాన్ని తరచూ వాడేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సాధారణంగా ఊతపదం అంటే మనకు తెలియకుండానే మాట్లాడుతున్నప్పుడు తరచూ వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి ఊత పదం లేకుండా ఒక్క సెంటెన్స్ కంప్లీట్ చేయడం కూడా కొన్ని కొన్ని సార్లు చాలా కష్టమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సామాన్య జనాలకి కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు సైతం ఇలాంటి ఊతపదం ఉంటుంది. కానీ ఇలాంటివి ఎక్కువగా బయటకి రానివ్వరు. అయితే ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి ఊతపదం ఒకటి ఉందట. దాదాపు రోజుకి వందలసార్లు ఈ ఊతపదం వాడేస్తూ ఉంటారట జూనియర్ ఎన్టీఆర్. అయితే ఒకప్పుడు కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. అందరితో కలిసిపోతూ ఎంతో జోవియల్ గా ఉంటాడు తారక్. స్టేటస్ తో సంబంధం లేకుండా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ 'అరే నీ' అనే ఊతపదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాడట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ఇంటర్వ్యూ లో తారక్ బయట పెట్టాడు. కనీసం రోజుకు వందసార్లు పైగానే 'అరే నీ' అనే పదాన్ని వాడతారట జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎక్కువగా స్నేహితుల దగ్గర ఇలాంటి పదాన్ని వాడుతూ ఉంటారట తారక్. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  దేవర అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: