ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహం గురించి. ఇక కన్నుల పండుగగా వివాహం జరుగుతుంది అంటూ ఉంటారు కదా.. ఇక ఇప్పుడు ఈ అపర కుబేరుడి కొడుకు వివాహం చూస్తూ ఉంటే కన్నుల పండుగగా వివాహం అంటే ఇలాగే ఉంటుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అతిరథ మహారధులందరూ ఇప్పటికే ఇక ఈ పెళ్లి వేడుక కోసం జామ్ నగర్  చేరుకున్నారు. ఈ క్రమంలోనే జామ్ నగర్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇప్పటికే గుజరాత్ లోని జామ్ నగర్ లో ఈ జంటకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు కూడా మొదలయ్యాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ గ్రాడ్ ఈవెంట్లో ప్రేక్షకులు అందరిని ఉర్రూతలూగించే విధంగా ఒక షో చేయాలని బాలీవుడ్ సెలబ్రిటీలు అలుపెరగని కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పర్ఫామెన్స్ మాత్రం సల్మాన్ ఖాన్ దే అని చెప్పాలి. ఇటీవల గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలైన్స్ టౌన్షిప్ లో కనిపించాడు సల్మాన్ ఖాన్. అక్కడ ఆనంత్ అంబానీ, రాధిక మార్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వేడుకలలో సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ ఏ పాటపై పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే సాధారణంగా సల్మాన్ ఖాన్ వివాహాలు లేదా ఇతర ప్రైవేట్ సందర్భాలలో ఇలాంటి పర్ఫామెన్స్ లు చేయడానికి ఐదుకోట్ల రూపాయల ఫీజులు డిమాండ్ చేస్తూ ఉంటాడు. 2013 లోనే ఢిల్లీలో జరిగిన ఒక ప్రముఖ వివాహ వేడుకలో అలరించేందుకు 3.5 కోట్లు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అంబానీ స్టేటస్ ను బట్టి సల్మాన్ ఖాన్ మరింత భారీగా ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. దాదాపు 10 కోట్ల వరకు కూడా అటు సల్మాన్ ఖాన్ చార్జ్ చేసే అవకాశం లేకపోలేదు అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: