సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల నుంచి ఎవరైనా హీరో హీరోయిన్లు ఇక నటులుగా ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు అంటే చాలు.. ఇక ఆ తర్వాత కాలంలో  వారి వారసులు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అటు అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లకు సంబంధించిన కొడుకు కూతురు ఫోటోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోకి వస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇలా స్టార్స్ వారసులు కాస్త పెద్ద అయ్యారు అంటే చాలు వారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు అంటూ ఎన్నో వార్తలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఇలా సినీ సెలబ్రిటీల పిల్లలపై సోషల్ మీడియా ట్రోలర్స్ అందరూ కాస్త ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టారు అంటే చాలు వారి ఫోటోలను తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తూ ఉన్నారు. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక స్టార్ హీరో కూతురుకు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది  ఈ వైరల్ గా మారిపోయిన ఫోటోలో ఉన్న అమ్మాయి ఏకంగా హీరోయిన్లను సైతం తలదన్నే అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా తన సినిమాలతో ఇక ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సూర్య కూతురు. అయితే ఇటీవల సూర్య, జ్యోతికల కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఆమె పేరు దియా. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. కానీ ఇటీవల  జ్యోతిక తన కూతురుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక ఈమె ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఇక ఈమెను చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఈమె అందం ముందు బడా హీరోయిన్లు కూడా బలాదూర్ అని ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: