ఒకప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు.. అయితే ఏకంగా వందల కోట్ల పారితోషకం తీసుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఒకప్పుడు ఏకంగా పాతిక లక్షల పారితోషకం అంటేనే నిర్మాతలు షాక్ లో మునిగిపోయేవారు. అలాంటి సమయంలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు ఏకంగా 50 లక్షల పారితోషకం తీసుకున్నారట మెగాస్టార్ చిరంజీవి. ఇక అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి పారితోషకం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా సినిమా తీసేందుకు అయ్యే మొత్తం బడ్జెట్ ను కేవలం మెగాస్టార్ మాత్రమే పారితోషకంగా తీసుకున్నారా అని అందరూ చర్చించుకున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకో విశేషమేమిటంటే.. మెగాస్టార్ యాభై లక్షలు తీసుకుంటే ఇదే సినిమాలో నటించిన మరో నటుడు మెగాస్టార్ కు మించిన రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఆయన ఎవరో కాదు అమ్రిష్ పురి. హిందీలో అప్పటికే తోపు యాక్టర్ గా కొనసాగుతున్న అమ్రిష్ పురి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కోసం టాలీవుడ్ కి వచ్చాడు. అశ్వినీ దత్ పట్టుబట్టి మరి ఆయనను తీసుకువచ్చారు. అయితే అమ్రిష్ పురి ఈ సినిమా కోసం 75 లక్షల పారితోషికం తీసుకున్నాడు. ఇక ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఒక సినిమాలో హీరోకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో మాత్రం హీరో కంటే అటు విలన్ కె ఎక్కువ పారితోషకం ఇచ్చారు. అయితే ఇక ఈ మూవీలో అటు చిరంజీవి సరసన హీరోయిన్గా నటించిన శ్రీదేవికి సైతం పాతికి లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. దాదాపు 23 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఇక అప్పట్లోనే ఈ మూవీ ఏకంగా 15 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి మెగాస్టార్ పేరును కేవలం సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా మారుమోగిపోయేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాతే ఇండియాలో తొలిసారి కోటి రూపాయల పారితోషకం అందుకున్న తొలి నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: