సాధారణంగా అయితే సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం కొనసాగుతూ ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. నేపోటిజం అంటే అందరికీ తెలిసే ఉంటుంది  ఏకంగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కేవలం వారి వారసులను మాత్రమే ఇండస్ట్రీలో ఎదిగేందుకు అటు మద్దతు ఇస్తూ ఉంటారు. ఇక ఎవరైనా బ్యాగ్రౌండ్ లేని వారు వస్తే ఇక వారిని తొక్కేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి నెపోటిజం తప్పకుండా ఉంటుంది అని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు పలువురు నటీనటులు. అయితే ఇటీవల కాలంలో ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.


 అలాంటి వారిలో టాలీవుడ్లో చూసుకుంటే విజయ్ దేవరకొండ నేటి జనరేషన్ కి ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. అయితే బాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం షాహీద్ కపూర్ అని చెప్పాలి. అదేమిటి షాహిద్ కపూర్ కి భారీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా.. అతను ఎలాంటి బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎందుకు పరిచయం అవుతాడు అని అనుకుంటున్నారు కదా.. కానీ అతను మాత్రం భారీ బ్యాగ్రౌండ్ ఉన్న అదేది ఉపయోగించుకోకుండానే తన సొంత టాలెంట్ను నమ్ముకొని ప్రస్తుతం సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే హీరోగా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు షాహిద్ కపూర్  అయితే ఇటీవల కెరియర్ తొలి నాళ్ళల్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షాహిద్ కపూర్.


 సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారికి అంత ఈజీగా బాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వరు అంటూ హీరో షాహిద్ కపూర్ చెప్పుకొచ్చాడు. నా పేరెంట్స్ నటులైనప్పటికీ వాళ్ల పేర్లు వాడుకోకుండానే సినిమాల్లోకి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కెరీర్ తోలినాళ్ళల్లో   కొందరు తనను హీనంగా చూడటంతో ఎంతగానో బాధపడ్డాను. అయితే అవకాశాల కోసం ఇక బాలీవుడ్ గ్యాంగ్ లో తిరిగే రక్తం నాది కాదు. టీనేజ్లో పోరాడలేకపోయాను. కానీ ఇప్పుడు ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టిన.. లేదంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేసిన చూస్తూ ఊరుకోను అంటూ షాహిద్ కపూర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: