సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే వారికి సంబంధించి ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే చాలు ఇక ఆ విషయం గురించి అందరూ తెగ చర్చించుకుంటూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. ఇక నిమిషాల వ్యవధిలో ఆ న్యూస్ ఇంటర్నెట్ మొత్తం పాకి పోతూ ఉంటుంది. అయితే ఇటీవల స్టార్ డైరెక్టర్ బాల గురించి ఇలాంటి వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా హీరోయిన్ మమిత బైజుపై స్టార్ డైరెక్టర్ బాలా చేయి చేసుకున్నాడంటూ సారాంశం ఉన్న వార్త ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇలా హీరోయిన్ తో డైరెక్టర్ బాల అనుచితంగా ప్రవర్తించడం కారణంగానే.. ఆమె ఇక సినిమా నుంచి తప్పుకుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ మమిత బైజునే తెలిపింది అంటూ న్యూస్ వైరల్ గా మారగా.. ఈ విషయంపై హీరోయిన్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. శివపుత్రుడు దర్శకుడు బాల తనను కొట్టారు అంటూ వచ్చిన వార్తలను ఖండించింది హీరోయిన్ మమిత బైజు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అని చెప్పాలి. నేను మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాంట్లో చిన్న అంశాన్ని కొంతమంది పెద్దది చేసి చూపించారు.


 ఈ క్రమంలోనే ఎన్నో అవాస్తవాలను కూడా ప్రచారం చేశారు. డైరెక్టర్ బాలా సార్ నన్ను ఫిజికల్ గా మెంటల్ గా ఎక్కడ హింసించలేదు. ఆయన సినిమా కోసం ఏకంగా ఏడాది పాటు పని చేశాను. ఇక ఆయన దర్శకత్వంలో నటనను కూడా మెరుగుపరుచుకున్నాను అంటూ హీరోయిన్ మమిత బైజు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఇక బాలా సార్ సినిమా చేయలేకపోతున్నాను అంటూ మమిత బైజు క్లారిటీ ఇచ్చింది. దీంతో షూటింగ్ సెట్లో డైరెక్టర్ బాల మమిత బైజుపై చేయి చేసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలకు పుల్ స్టాప్  పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: