మమ్ముట్టి నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ మొత్తానికి ఓటీటీ లోకి అడుగుపెట్టబోతోంది.ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి ఈ నెల లోనే రాబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఓ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా అబ్రహం ఓజ్లర్ మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రే అయినా కూడా ఆయన ఓ సీరియల్ కిల్లర్ గా నటించడం విశేషం.. జయరాం ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు.మలయాళ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ మూవీ మార్చి 20 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని శుక్రవారం (మార్చి 1) హాట్‌స్టారే అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా కేవలం మలయాళంలోనే వస్తుందా లేక మిగతా భాషల్లోనూ అందుబాటులో ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. మిధున్ మాన్యుయెల్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జయరాం కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతేడాది డిసెంబర్ 25న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజైంది.ఈ సినిమా కథ విషయానికి వస్తే అబ్రహం ఓజ్లర్ (జయరాం) భార్యాపిల్లలు మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినా ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు. వారి వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు..?అలెక్స్ (మమ్ముట్టి) సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి…? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: