సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.. ప్రముఖ సీరియల్ ఫేమ్ మొగలిరేకుల సీరియల్లో దయ అలియాస్ పవిత్ర నాథ్ కన్నుమూశారు.. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.. అతడిని గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్టుని షేర్ చేశారు.." పవీ ఈ బాధను మేము మర్చిపోలేక పోతున్నాము ..మా జీవితంలో చాలా ముఖ్యమైన వాడివి నువ్వు ఈ వార్త విన్న తర్వాత ఈ విషయం నిజం కాకూడదని చాలాసార్లు కోరుకున్నాను కానీ ఇది అబద్ధమైతే బాగుండని ఆశ ఉన్నది నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచి పెట్టడం జీర్ణించుకోలేనీ విషయమని.. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాము గుడ్ బై చెప్పలేకపోయాము చాలా మిస్ అవుతున్నామంటూ వెల్లడించారు..


నీ ఆత్మకు శాంతి చేకూరాలని బాగా ద్వేగానికి గురయ్యారు. దయ చనిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ అంటే కచ్చితంగా చక్రవాకం అని చెప్పుతారు.. మంజుల నాయుడు ఈ సీరియల్ ని తెరకెక్కించారు. టీవీ ఆడియన్స్ ని కూడా భారీగానే ఆకట్టుకుంది.. చక్రవాకం తర్వాత అదే స్థాయిలో ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్న మొగలిరేకులు సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది..

అయితే మొగలిరేకులు సీరియల్ లో కనిపించిన ధర్మ సత్యా,దయ ,శాంతి, కీర్తన పాత్రలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు అన్నదమ్ములుగా కనిపించే వారిలో చిన్నవాడు దయ చాలా అల్లరిగా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. సీరియల్ మధ్యలో దయ పాత్ర చనిపోవడంతో ఆ పాత్ర ముగిసింది ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.. ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టాగ్రామ్ లో దయ ఎలా చనిపోయారు ఎప్పుడు జరిగింది అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి.. గతంలో పవిత్రనాథ పై అతని భార్య కూడా సంచలన ఆరోపణలు చేసింది.తనకు అమ్మాయిలు పిచ్చి ఉందని తన ముందరే వారిని ఇంటికి తీసుకువచ్చే వారిని వీటి పైన ప్రశ్నిస్తే దాని కొట్టే వారిని ఆరోపణలు కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: