శేఖర్‌ మాస్టర్‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన కామెంట్లు, ఆయనకు సంబంధించిన విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు హైపర్‌ ఆది కామెంట్‌ రచ్చ అవుతుంది.తెలుగులో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు శేఖర్‌ మాస్టర్‌. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడలోనూ స్టార్‌ హీరోలకు ఆయన డాన్సుమాస్టర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు టీవీ షోస్‌ కూడా చేస్తున్నారు. ఆయన ఈటీవీ ఢీ షోకి జడ్జ్ గా ఉన్నారు. ప్రణితతో కలిసి జడ్జ్ గా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన డాన్సర్లని చూసి రియాక్ట్ అయ్యే విధానం, దీనికి హైపర్‌ ఆది కౌంటర్ల ఇంట్రెస్టింగ్‌ ఉంటాయి.నందు హోస్ట్ గా ఈ ఢీ డాన్స్ షో రన్‌ అవుతుంది. ఇందులో హైపర్‌ ఆది ఒక టీమ్‌కి లీడర్‌ గా వ్యవహరిస్తున్నారు. మధ్య మధ్యలో తనదైన పంచ్‌లు, కామెడీ డైలాగ్‌లతో ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు. షోని రక్తి కట్టిస్తుంటాడు. అటు డాన్సర్లపై, మరోవైపు జడ్జ్ లపై సెటైర్లు పేలుస్తుంటాడు. నవ్వులు పూయిస్తుంటాడు. ప్రధానంగా ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఆయన్ని వాడుకుంటున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఢీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో శేఖర్‌ మాస్టర్‌పై హైపర్‌ ఆది చేసిన కామెంట్‌ పెద్ద రచ్చ అవుతుంది. ఉన్నట్టుండి పెద్ద బాంబ్‌ లాంటి పంచ్‌ వేశాడు. దీనికి శేఖర్‌ మాస్టర్‌తోపాటు అక్కడ ఉన్న వారంతా అవక్కయ్యారు. అంతేకాదు నెటిజన్లు కూడా సేమ్‌ అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం. మరి ఇంతకి ఏం జరిగిందంటే..ఢీ షోలో డాన్సర్లంతా తమదైన డాన్సులతో ఇరగదీస్తున్నారు. ఒకరిని మించి మరొకరు పర్‌ఫెర్మ్ చేస్తున్నారు. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. అంతగా రెచ్చిపోతున్నారు. అదే సమయంలో ఇందులో ఒకటి రెండు హాట్‌ డాన్స్‌ పర్‌ఫెర్మెన్స్ కూడా వచ్చాయి. దీనికి షోలో ఉన్న వాళ్లంతా ఫిదా అయ్యారు. శేఖర్‌ మాస్టర్‌ కూడా మెస్మరైజ్‌ అయ్యారు. ఒకరికైతే ఏకంగా లేచి క్లాప్స్ కొట్టాడు.

 ఈ క్రమంలో ఓ జంట పర్ఫెర్మెన్స్ నెక్ట్స్ లెవల్‌ ఇంటెన్సిటితో ఉంది. రొమాంటిక్‌గా ఉంది. ఇది చూస్తూ శేఖర్‌ మాస్టర్‌ విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇది హైపర్‌ ఆది గమనిస్తున్నాడు. ఈ పర్‌ఫెర్మెన్స్ అయిపోయిన తర్వాత శేఖర్‌ మాస్టర్‌ బాటిల్‌లో నీళ్లు తాగేశాడు. దీనికి వెంటనే హైపర్‌ ఆది రియాక్ట్ అయ్యాడు. బాబోయ్‌.. మీరు ఎంత దాహంతో ఉన్నారండి బాబూ అని డబుల్‌ మీనింగ్‌ వచ్చేలా కామెంట్‌ చేశాడు. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది. దీనికి షో మొత్తం హోరెత్తిపోయింది.హైపర్‌ ఆది ఫన్నీగానే అన్నాడు. జనరల్‌గా శేఖర్‌ మాస్టర్‌, ఆది మధ్య ఇలాంటి కన్వర్జేషన్‌ ఫన్‌ కోసం నడుస్తూనే ఉంది. కానీ దీన్ని కొందరు సీరియస్‌గా తీసుకుని శేఖర్‌ మాస్టర్‌ నిజంగానే దాహంతో ఉంటాడని, ఆయన దాహం తీరనిది అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. చాలా డబుల్‌ మీనింగ్‌ వచ్చేలా వాళ్లు రియాక్ట్ కావడమే ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పాల్గొన్నాడు శేఖర్‌ మాస్టర్‌. యాంకర్‌ రష్మితో ఆయన సరసాలు ఆడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆది కామెంట్లు మరింత రచ్చ లేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: