టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో గోపీచంద్ ఒకరు. ఈయన తాజాగా బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ , మాళవికా శర్మ హీరోయిన్ లుగా నటించగా ... హర్ష అనే కన్నడ దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా గోపీచంద్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా గోపీచంద్ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రభాస్ తో తన మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఎప్పుడు అనేది చెప్పలేను కానీ ఖచ్చితంగా ప్రభాస్ తో ఓ సినిమా చేస్తా. కథ , నేపథ్యం ఇతర వివరాలు గురించి ఇంకా ఏమీ అనుకోలేదు అని తెలిపారు. ఇక దానితో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా నిర్మించేందుకు నేను సిద్ధమని నిర్మాత  రాధా మోహన్ చెప్పారు.

ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా గోపీచంద్ విలన్ గా వర్షం అనే మూవీ వచ్చింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ , గోపీచంద్ కు మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి. అలాగే వర్షం మూవీ లోని వీరిద్దరి నటనలకు కూడా ఆ సమయం లో ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మరి వీరి కాంబో లో ఒక వేళ సినిమా వస్తే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc