స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో ఆలియా భట్ ఒకరు . ఈ సినిమాలో ఈ నటి తన అద్భుతమైన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అలాగే ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి ఈ మూవీ తోనే సూపర్ క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది.

ఆ తర్వాత కూడా ఈమెకు అనేక క్రేజీ సినిమా లలో అవకాశాలు దక్కాయి . అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను సాధించడంతో ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉంది. ఇంతటి క్రేజ్ కలిగిన ఈ బ్యూటీ తన క్రేజ్ తోనే కొన్ని సినిమాలను విజయం వైపు తీసుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా సినిమా విజయంలో కూడా అత్యంత కీలక పాత్ర ను పోషిస్తున్న ఈమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను ఒక్కో సినిమాకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఆలియా ఒక్కో సినిమాకు 10 నుండి 20 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ... సినిమా కథ బాగా నచ్చినట్లు అయితే కాస్త తక్కువ పారితోషకాన్ని కూడా తీసుకుంటున్నట్లు ... అలాగే సినిమాకి తక్కువ రోజులను కేటాయించినట్లు అయినా కూడా చాలా తక్కువ మొత్తంలో ఈ ముద్దుగుమ్మ సినిమాకి చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా దర్శకుడు , నిర్మాతను పట్టి కూడా ఈమె తన రెమ్యూనరేషన్ ను డిసైడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: