తరుణ్ హీరో గా ...ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా లయ  , శరత్ బాబు , చంద్ర మోహన్ , సునీల్ ముఖ్య పాత్రలలో నువ్వు లేక నేను లేను అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుపాటి సురేష్ బాబు నిర్మించారు. ఇకపోతే 2002 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మూవీ లోని తరుణ్ , ఆర్తి అగర్వాల్ నటనలకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కాశీ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మొదట నువ్వు లేక నేను లేను సినిమాను తరుణ్ తో అనుకోలేదు అని ... వేరే స్టార్ హీరోతో అనుకున్నాం. అలాగే ఈ మూవీ నిర్మాత సురేష్ బాబు గారు కూడా స్టార్ హీరో తోనే చేద్దాం అని అనుకున్నారు. కానీ ఆ సమయం లో అది కుదరలేదు అని తెలిపాడు. ఇక తాజా ఇంటర్వ్యూ లో ఈయన నువ్వు లేక నేను లేను సినిమా గురించి మాట్లాడుతూ ... మొదట నువ్వు లేక నేను లేను సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాము.

సురేష్ బాబు గారు కూడా మహేష్ బాబు తో ఈ సినిమా బాగుంటుంది అన్నారు. కాకపోతే మా యూనిట్ తర్వాత మహేష్ డేట్స్ దొరకడం చాలా కష్టం. మహేష్ తో సినిమా తీయాలి అంటే చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది. మాకు ఆ సమయం లో తరుణ్ కూడా ఈ సినిమాకు బాగా సెట్ అవుతాడు అనిపించింది. అందుకే ఈ మూవీ ని తరుణ్ తెరకెక్కించాం అని తాజా ఇంటర్వ్యూ లో ఈ మూవీ దర్శకుడు కాశీ విశ్వనాథ్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: