జీవిత రాజశేఖర్.. ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు అనడంలో ఎలాంటి అస్సందేహం లేదు. ఎందుకంటే ఇక ఎన్నో ఏళ్ల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్గాప్రేక్షకులను అలరించిన ఆమె ఆ తర్వాత కాలంలో మాత్రం ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ దర్శకురాలిగా మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక భర్త హీరో రాజశేఖర్ కెరియర్ కు  అండగా నిలబడుతూ ఆయన కెరియర్ ను నిలబెట్టే పనిలో బిజీబిజీగా ఉంది. అయితే జీవిత రాజశేఖర్ ని ఫైర్ బ్రాండ్ అని కూడా ఇండస్ట్రీలో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తనపై ఎవరైనా విమర్శలు చేస్తే గట్టిగానే సమాధానం చెబుతూ ఉంటుంది జీవిత రాజశేఖర్.


 అయితే గతంలో హీరోయిన్గా వరుసగా అవకాశాలు అందుతున్న సమయంలోనే జీవిత ఇక సినిమాలను పూర్తిగా దూరం పెట్టేసింది అన్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు సినిమాలను ఆపేయాల్సి వచ్చింది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు ఆమె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తొలిసారి నటనను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. ఇలా సినిమాలను ఆపడానికి తన భర్త రాజశేఖర్ కారణం అంటూ వెల్లడించింది జీవిత. హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే హీరో రాజశేఖర్తో ప్రేమలో పడింది ఆమె. ఇక ఇలా తాను రాజశేఖర్తో ప్రేమలో పడటం పెళ్లి తర్వాత జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించింది. తాను రాజశేఖర్ ని ప్రేమించాక పెళ్ళికి పెద్దలు ఒప్పించడానికి చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తన ఇంట్లో వాళ్ళు త్వరగానే పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ రాజశేఖర్ కుటుంబ సభ్యులు అసలు ఒప్పుకోలేదట. ఆస్తి అంతస్తులో అన్నిట్లో జీవిత కుటుంబం కంటే రాజశేఖర్ కుటుంబం హై లెవెల్లో ఉండడంతో జీవితను కోడలుగా వద్దని తెగేసి చెప్పేసారట. రాజశేఖర్ మాత్రం తాను పెళ్ళంటూ చేసుకుంటే జీవితనే పెళ్లి చేసుకుంటాను అంటూ పట్టడంతో పెళ్లికోపుకున్నారట. తర్వాత తన అత్తయ్య గారి ఇంట్లో అందరితో ఈ మంచి కోడలుగా అనిపించుకోవాలని కుటుంబ బాధ్యతలు భర్త అత్తమామలను చక్కగా చూసుకోవాలని ఫిక్స్ అయిందట ఆమె. ఇక ఇలా సినిమాలకు గుడ్ బై చెప్తాను అంటూ రాజశేఖర్ కు చెప్పగా ఆయనకు కూడా నీ ఇష్టం అని చెప్పారట. ఇక తర్వాత కాలంలో ఇండస్ట్రీ గురించి ఆలోచించకుండా తన కుటుంబ బాధ్యతల పైన దృష్టి పెట్టిందట జీవిత రాజశేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి: