మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసి స్టార్స్ గా రాణిస్తున్నారు. అలాంటి సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు.వారి చేసే సినిమాల్లో కొంత ప్రయోగం ఉన్న కచ్చితంగా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండేలా చూసుకుంటారు.అయితే వరుణ్ తేజ్ మాత్రం వారికి భిన్నంగా కంటెంట్ బేస్డ్ మూవీస్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు.


తన ఫస్ట్ సినిమా ముకుంద ఫ్యామిలీ సినిమా అయినా రెండో సినిమా కంచె మాత్రం ప్రయోగాత్మక చిత్రంగానే తెరకెక్కింది.ఆ తరువాత కమర్షియల్ లైన్ లోకి వరుణ్ తేజ్ వచ్చినా కూడా  వాటి వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది. తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కథలు ఎక్కువగా చేయడానికి వరుణ్ మొగ్గు చూపిస్తున్నాడు. అయితే వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలకి మాత్రం బిగ్ స్క్రీన్ పై మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.లవ్ స్టోరీ ఫిదా కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఓపెనింగ్స్ తక్కువ వచ్చిన లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అయితే వరుణ్ తొలిప్రేమ సినిమా మొదటి రోజు ఏకంగా 10 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇంకా అలాగే గద్దలకొండ గణేష్  ఫస్ట్ డే ఏకంగా 11కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ స్థాయిలో మళ్ళీ ప్రభావం చూపించిన సినిమాలు వరుణ్ తేజ్ నుంచి రాలేదు.మిస్టర్ మూవీ పెద్ద డిజాస్టర్ అయిన మొదటి రోజు 5.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


అయితే వరుణ్ తేజ్ ప్రయోగాత్మకంగా చేసిన గని మూవీ మాత్రం మొదటి రోజు కేవలం 4.8 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. గత సంవత్సరం రిలీజ్ అయినా గాండీవదారి అర్జున అయితే 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక తాజాగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ మరీ దారుణంగా 2 కోట్ల కంటే తక్కువ గ్రాస్ మొదటి రోజు వసూళ్లు చేసింది.దీన్ని బట్టి వరుణ్ తేజ్ కి ప్రయోగాలు చేయాలనే ఇంటరెస్ట్ ఉన్నా కూడా ఆడియన్స్ మాత్రం అతని ప్రయోగాలపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొత్త కథల కంటే ముందు మెగా ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసే కమర్షియల్ స్టార్ గా వరుణ్ తేజ్ ఎస్టాబ్లిష్ కావాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. అయితే వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ మట్కా కమర్షియల్ లైన్ లోనే రాబోతుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా వస్తోంది. మరి ఈ మూవీ అయిన అతని ఇమేజ్ ని మళ్ళీ నిలబెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: