తమిళ నటి నయనతార మొదట్లో చిన్న హీరోయిన్ గా అడుగుపెట్టి తరువాత కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా జెండా పాతేసింది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌ గా ఉండకపోయినా ఏదో ఒక వివాదంతో మాత్రం ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా బోలెడన్ని ఎఫైర్లతో ఈ బ్యూటీ చాలా ట్రెండ్ అయింది. దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి డేటింగ్ చేసి ఎన్నో ఏళ్ల తరువాత అతన్ని పెళ్లి చేసుకుంది. అతని కంటే ముందు శింబు, విశాల్, ఆర్య, ప్రభుదేవా లాంటి కోలీవుడ్ స్టార్స్ తో కూడా డేటింగ్ చేసింది.ఈ విషయం అందరికి తెల్సిందే. ఈమధ్యనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన నయనతారా చాలా అరుదుగా మాత్రమే పోస్ట్‌ లు చేస్తూ ఉంటుంది.విషయానికి వస్తే పెళ్ళికి ముందు డేటింగ్ లు చేస్తూ బ్రేక్ అప్ లతో వార్తల్లో నిలిచిన ఈవిడ పెళ్లి తరువాత కూడా బ్రేక్ అప్ వార్తల్లో నిలుస్తుంది.ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.


ఎందుకంటే నయనతార ఉన్నట్లుండి తన ఇన్ స్టా అకౌంట్ నుంచి భర్త విఘ్నేష్‌ శివన్‌ ను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేంటి భర్త ను ఎందుకు నయన్‌ అన్‌ఫాలో అయ్యిందని అంతా కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ షురూ అయ్యింది. చాలా మంది నయన్‌, విఘ్నేష్‌ బ్రేకప్‌ అంటూ ఇప్పుడు మాట్లాడుకున్నారు. అయితే వాటికి చెక్‌ పెడుతూ మళ్లీ నయన్‌ తన భర్త విఘ్నేష్ ను ఇన్‌ స్టా లో ఫాలో అవ్వడం మొదలు పెట్టింది. అయినా కూడా ఏదో జరుగుతున్నట్లుగా అనిపిస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే తాజాగా విఘ్నేష్‌ శివన్ తన భార్య నయనతార ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా పుకార్లన్నింటికి కూడా చెక్‌ పెట్టినట్లు అయ్యింది. సాంకేతిక కారణం లేదంటే మరేదైనా కారణం వల్ల నయన్‌ అకౌంట్‌ నుంచి కొన్ని గంటల పాటు విఘ్నేష్ శివన్‌ అన్ ఫాలో అవ్వడం జరిగిందేమో.. అసలు అసలు విషయం ఏంటి అనేది వారు చెప్తే కానీ క్లారిటీ వచ్చే ఛాన్స్ అవకాశం లేదు. ఏది ఏమైనా రిలేషన్ షిప్ విషయాల్లో నయనతార ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: