మలయాళ ఇండస్ట్రీ నుండి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉన్నాయి.పైగా అవి కూడా చిన్న సినిమాలు. అనూహ్యంగా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఎక్కువగా యూత్ కి సంబంధించిన లవ్ స్టోరీ లు కామెడీ డ్రామాలే ఉన్నాయి. ఇక అందులో రీసెంట్ గా రిలీజ్ అయిన “మంజుమ్మేల్ బాయ్స్” అనే సినిమా మాత్రం ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళని రాబడుతుంది. ఇప్పటికే అరవై కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఇప్పుడు వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది.ఇక పది రోజుల కింద రిలీజ్ అయిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఒక పక్క కేరళలో భారీ వసూళ్లతో దుమ్ము లేపుతూ  మరో పక్క, పక్క రాష్ట్రం తమిళనాడులో సొంత రాష్ట్రంలో కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. తమిళనాడులో ఏ మలయాళ సినిమా సాధించని రికార్డులను నమోదు చేస్తుంది మంజుమ్మేల్ బాయ్స్.


అయితే గతంలో మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ ఒకే రోజు తమిళనాడులో 2 కోట్లు వసూలు చేసి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించగా రీసెంట్ గా ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్ మూవీ ఇప్పుడు రెండో శుక్రవారం వర్కింగ్ డే లో కూడా అక్కడ అదరగొట్టింది. అక్కడ ఎనిమిదో రోజు ఏకంగా 2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఒక్క రోజులో మళ్ళీ వసూలు చేసి సూపర్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇదే టైంలో కేరళలో మంజుమ్మేల్ బాయ్స్ రెండో శుక్రవారం నాడు 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటే, అరవ రాష్ట్రమైన తమిళనాడులో మాత్రం ఏకంగా 2 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ వీకెండ్ ఆదివారంతో మరిన్ని వసూళ్ళు రాబట్టి ఏకంగా 5 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఖచ్చితంగా లాంగ్ రన్ లో 100 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టేటట్లుంది.ఇలా రికార్డ్ వసూళ్లతో దూసుకుపోతున్న మంజుమ్మేల్ బాయ్స్ కి ప్రస్తుతం పోటీగా మళ్ళీ ఏ సినిమా కూడా రాకపోతే ఖచ్చితంగా 150 కోట్ల మార్క్ నైనా అందుకునే అవకాశం చాలా ఈజీగా ఉంది. ఇక త్వరలో తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: