హీరోయిన్ రెజీనా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో రెజీనా బీజీగా ఉండేవారు. అయితే ఆ తర్వాత ఆమెకు డిమాండ్ తగ్గడంతో వెబ్ సిరీస్ ల్లో చేయడం ప్రారంభించారు. వెబ్ సిరీస్ ల్లో రెజీనా బిజీగా మారిపోయారు. ఇప్పుడు ఆమెకు మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. చిన్న చిన్నసినిమాల్లో చేయడానికి ఆమెకు భారీగా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా.. అని చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.రెజీనాపై అప్పట్లో పలు ఊహాగానాలు వచ్చియ. ఆమె సందీప్ కిషన్ తో ప్రేముల ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సందీప్ కిషన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిపై సందీప్ కిషన్ స్పందించారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పారు. దీంతో అప్పుడు వచ్చి రూమర్స్ కు తెర పడింది. ఆ తర్వాత రెజీన్ సాయి ధర్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి కూడా రూమర్స్ అనే తేలిపోయింది.కొద్ది రోజుల క్రితం రెజీనా తమిళ స్టార్ హీతో తో రిలేషన్ లో ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా వట్టే పుకారేనని తెలిసింది. ఈ రూమర్స్ పై రెజీనా ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వ్యాపారవేత్తను రెజీనా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి పై రెజీనా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రెజీనా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రచారం జోరుగా సాగుతోంది. రెజీనా ప్రస్తుతం అజిత్ హీరోగా తమిళంలో రూపొందుతున్న విడమయూర్చి సినిమాలో నటిస్తున్నారు. మూవీలో అర్జున్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. రెజీనా అర్జున్ భార్య పాత్ర చేస్తున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: