టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు ఊరి పేరు భైరవకోన.. ఈ సినిమా ట్రైలర్ కూడా అందరిని ఆసక్తిపరిచేలా చేసింది. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా వేగవంతం చేయడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది.. ఫిబ్రవరి 16న ఈ సినిమా థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్ళింది.. అయితే తర్వాత అనుకున్నంత స్థాయిలో హవా చూపించలేకపోయింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ఓటిటి కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


సినిమా ఓటిటి స్ట్రిమింగ్ హక్కులను సైతం zee -5 ప్లాట్ఫారం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీన స్ట్రిమ్మింగ్ అయ్యే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉండగా మరొకవైపు ఆహ లో కూడా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.. ఊరి పేరు భైరవకోన సినిమాని డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించారు..


సినిమా హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలానే చూపించారు. ఇందులో హీరోయిన్ గా వర్ష బోల్లమ్మ , కావ్య దాపరి నటించారు ..వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితర నటినటులు కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ .27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. మొదటి వారం నుంచి ఈ సినిమా వసూళ్లు భారీగానే రాబట్టింది పోటీగా మరే చిత్రాలు లేకపోవడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే అందుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రంతో  సందీప్ కిరీషన్ కెరియర్ మారిపోయిందని అభిమానులు తెలుపుతున్నారు.. మరి తన తదుపరిచిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: