మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నారు అన్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగుల్లో పాల్గొంటూ ఉన్నారు అని చెప్పాలి.  అయితే ప్రస్తుతం మెగాస్టార్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభరా  బింబిసారా అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వశిష్ట ఇక ఈ మూవీకి దర్శకుడిగా పని చేస్తూ ఉన్నాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత మెగాస్టార్ ఇక ఆ తరహా ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఇక ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ముల్లోకాల చుట్టూ విశ్వంభరా మూవీ కథ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో ఒక వీరుడిగా కనిపించబోతున్నాడట మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అంతేకాకుండా సురభి, ఈషా చావ్లా కూడా ఇక కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమాకి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే త్రిష కాకుండా సురభి, ఇషా చావ్లాని ఎంపిక చేసినప్పటికీ మరికొంతమంది హీరోయిన్లను కూడా ఇంకా ఎంపిక చేయాల్సి ఉందట. అంతేకాకుండా ఇప్పటికే ఎంపిక చేసిన ఇద్దరు హీరోయిన్లకు జోడీలుగా యువ హీరోలను తీసుకోబోతున్నట్లు టాక్. ఇప్పటికే సుశాంత్, రాజ్ తరుణ్ లాంటి హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మొత్తంగా ఏకంగా మెగాస్టార్ చెల్లెలి పాత్రల కోసం ఐదుగురు హీరోయిన్స్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట మేకర్స్. ఇక వారికి జోడిగా ఐదుగురు యువ హీరోలను కూడా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత మంది హీరో హీరోయిన్లు ఎక్కడినుంచి పట్టుకొస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: