ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో   అటు విశ్వక్సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గా మారి తన కెరియర్ను తానే నిలబెట్టుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే  అయితే విశ్వక్సేన్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గామి. ఇప్పటివరకు లవర్ బాయ్ గా మాత్రమే విశ్వక్సేన్ ని ప్రేక్షకులు చూశారు. కానీ గామి సినిమాలో మొదటిసారి అఘోర అనే ఒక డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ అభిమానులు అందరిలో కూడా అంచనాలను రెట్టింపు చేసింది.


 ఇక ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు. అయితే ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన గామి సినిమా మొదలై దాదాపు ఆరేళ్లు గడిచి పోతుంది అన్న విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూనే వస్తోంది   అయితే అదిగో రిలీజ్ అవుతుంది ఇదిగో రిలీజ్ అవుతుంది అనే మాటే తప్ప.. ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేకపోయింది. చివరికి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది గామి మూవీ. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం అటు ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ విద్యాధర్ కాగిత గామి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. 2018లోనే గామి సినిమాను 25 లక్షల బడ్జెట్ తో తీసేందుకు సిద్ధమయ్యాము అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అయితే దాదాపు ఆరేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూనే ఉంది అంటూ తెలిపాడు. అయితే గత ఐదేళ్లుగా విశ్వక్సేన్ చేయాల్సిన షూటింగ్ పెండింగ్లో పడుతూనే ఉంది. అయితే ఇక ఈ సినిమా ఓపెనింగ్ సీన్ 2018లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశామూ. కానీ 2023 నవంబర్లో కంప్లీట్ చేసాం అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక అఘోరా పాత్రలో నటించడానికి విశ్వక్సేన్ ఎంతగానో కష్టపడ్డాడు. ఇక ఆ పాత్రలో ఒదిగి పోయాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మూవీ కోసం విశ్వక్సేన్ ఒక రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు అంటూ విద్యాధర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: