టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ మరికొన్ని రోజుల్లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందబోయే ఓ సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికీ వెలువలేకపోయినప్పటికీ ఆల్మోస్ట్ ఈ కాంబో లో సినిమా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరి కాంబినేషన్ లో "ఎఫ్ 2" "ఎఫ్ 3" అనే రెండు మూవీ లు రూపొందాయి . ఇందు లో "ఎఫ్ 2" మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోగా "ఎఫ్ 3" మూవీ పరవాలేదు అనే స్థాయి విజయం అందుకుంది.

ఇకపోతే ఇప్పటికే అనిల్ రావిపూడి ... వెంకటేష్ తో తదుప రి రూపొందించ బోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది . అందులో భాగంగా ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటించబోయే హీరోయిన్ ను కూడా కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... వెంకీ , అనిల్ కాంబోలో రూపొందబోయే నెక్స్ట్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమా యొక్క కథను వినిపించినట్లు ఆ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ నటి ఆ సినిమా లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా మీనాక్షి చౌదరి "గుంటూరు కారం" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: