టాలీవుడ్ యువ నటుడు నితిన్ ఆఖరుగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ కథ రచయిత అయినటువంటి వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... హరిజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక దానితో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. ఇలా థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించలేకపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని వచ్చే ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: