టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ చాలా సంవత్సరాల క్రితం విద్యాధర్ దర్శకత్వంలో గామి అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక పోతే ఈ మూవీ అత్యంత భారీ గ్రాఫిక్స్ పనులతో రూపొందడంతో ఈ మూవీ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది . ఇక పోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఇక ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 8 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది . అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. 

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా ఆ ట్రైలర్ అదిరిపోయి రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై జనాల్లో ఒక్క సారిగా అంచనాలు భారీ స్థాయికి పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఇండియా వ్యాప్త థియేటర్ హక్కులను ఎవరు దక్కించుకున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క టోటల్ ఇండియా వైడ్ థియేటర్ హక్కులను మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సంస్థ వారు ఈ సినిమాను ఇండియా వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటికే ప్రణాళికలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చాందిని చౌదరి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs