టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ... బాహుబలి ... "ఆర్ ఆర్ ఆర్" మూవీ లతో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరి కొంత కాలంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ "ఎస్ ఎస్ ఎం బి 29" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించనుండగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి , మహేష్ తో రూపొందించబోయే సినిమాలో మహేష్ మాత్రమే కాకుండా మరో హీరో కూడా ఉండబోతున్నట్లు ఆ హీరో ఇండియన్ హీరో కాకుండా హాలీవుడ్ హీరో అని ఓ వార్త వైరల్ అవుతుంది. అలా మహేష్ తో పాటు మరో హాలీవుడ్ హీరో కూడా ఈ సినిమాలు నటించబోతున్నట్లు ఇది ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: