సాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు పెళ్లిళ్ల విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోతూనే ఉంటుంది. అయితే పెళ్లి, ప్రేమయనం లేకుండానే ఇక ఇలాంటి వార్తలు పుట్టుకొస్తూ ఉంటే.. అలాంటిది ఇక నిజంగానే పెళ్లి జరుగుతుంటే ఆ వార్త ఇంటర్నెట్ ని ఎంతలా షేక్ చేస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల ఎవరు ఊహించని విధంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన ఎంగేజ్మెంట్ ను చేసుకుంది. ఏకంగా 14 ఏళ్ల నుంచి పరిచయమున తన స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది ఈమె.


 ఆయన పేరు నికోలయ్. అయితే ఇటీవలే ఇక తన కాబోయే భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది ఈ హీరోయిన్. అయితే ఇక ఇలా ఎవరైనా హీరోయిన్ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అంటే చాలు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ తెగ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన నికోలయ్  బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసి అందరూ అవాక్ అవుతున్నారు. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లయినవాడినే మరోసారి పెళ్లి చేసుకోబోతుందట.


 నికోలైకు అంతకుముందే పెళ్లి అయినట్లు తెలిసింది. నీకోలయ్ మాజీ భార్య పేరు కవిత. ఆమె ఒక మోడల్ అని సమాచారం. అయితే ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతుందట. కానీ వీరిద్దరికీ పెళ్లి అయిన కొన్నాళ్లకే మనస్పర్ధలు రావడంతో చివరికి విడాకులు తీసుకున్నారట. అయితే ఈ విషయం వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా తెలుసట. అయినప్పటికీ  అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందట వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఈ విషయం తెలిసి కొంతమంది మాత్రం షాక్ అవుతున్నారు. ఏకంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకోబోయేది చివరికి ఒక పెళ్లయినోడినైనా అని కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా కోలీవుడ్ హీరో శరత్ శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా మాత్రమే  కాకుండాఎన్నో భిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: