స్టైలిష్ స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అల్లు అరవింద్ వారసత్వాన్ని అందుపిచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బన్నీ తండ్రిని మించిన కొడుకు అయ్యాడు. మొదట్లో బన్నీ సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా అనంతరం బాగా సక్సెస్ అయ్యాయి. దీంతో బన్నీ పేరు మారు మోగింది. ఇక ఇటీవల పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరో అయిపోయిన బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే బన్నీ వైఫ్ స్నేహ రెడ్డి కూడా మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి చెందినది కాకపోయినా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. జిమ్ వర్కౌట్స్ వీడియోలను షేర్ చేస్తూ కొందరికి ఇన్స్పిరేషన్ గా మిగిలింది.ఇక బన్నీ ఇది మరియు స్నేహ రెడ్డిది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. స్నేహ రెడ్డి 1985 సెప్టెంబర్ 29 హైదరాబాద్లో జన్మించింది. హైదరాబాద్లోని ఓక్రిట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది. ఇంగ్లాండులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది. ఇక చదువు పూర్తయిన అనంతరం ఓ ఇన్స్టిట్యూట్లో స్నేహ రెడ్డి ప్లేస్మెంట్స్ డైరెక్టర్ గా చేరింది. ఇక స్నేహ రెడ్డి మరియు అల్లు అర్జున్ ని 2011 మార్ష్ తారీకున వివాహం చేసుకుంది. వీరిద్దరూ ఒక కామన్ ఫ్రెండ్ ఫంక్షన్లో కలిశారు. అనంతరం వీరు మధ్య స్నేహం ఏర్పడింది.ఇక ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో చూసి స్నేహారెడ్డిని సినిమాలో లాగా పడేశాడు అల్లు అర్జున్. వీరిద్దరి లవ్ స్టోరీ చూస్తుంటే అచ్చం సినిమాలో లాగానే ఉంటుంది. ఇక వీరి లవ్ స్టోరీ ని చూసిన కొందరు..' నిన్ను చాలా క్లాస్ అనుకున్నాం బ్రో. నువ్వు ఇంత మాస్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో చూసి స్నేహారెడ్డిని పడేశావంటే నువ్వు మామూలోడివి కాదు ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: