రష్మిక పరిచయం అక్కర్లేని పేరు, ఈమె కన్నడ ఇండస్ట్రీలో తన కెరియర్ ప్రారంభించి తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఆ తరువాత విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సినిమాతో టాప్ హీరోయిన్ గా మారి వరుస అవకాశాలతో దూసుకేలుతూ.. అల్లు అర్జున్ సరసన పుష్పా సినిమాలో నటించిన నేషనల్ క్రాష్ గా మారిపోయింది. ఆ తరువాత రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్‌ సినిమా విడుదల అయ్యి సూపర్‌ హిట్‌ అయిన తర్వాత బాలీవుడ్‌ లో కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో చేరి పోయిన విషయం తెల్సిందే. అక్కడి పలువురు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఈ అమ్మడితో సినిమాలలో నటించే విషయంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పుష్ప 2 లో తన పాత్ర బాధ్యత మరింత పెరిగిందని, సినిమాల ఎంపిక విషయంలో రష్మిక తీసుకునే జాగ్రత్తలపై స్పందిస్తూ.. మొదట నేను స్క్రిప్ట్‌ పూర్తి గా వింటాను. స్క్రిప్ట్‌ నచ్చిన తర్వాత నా పాత్ర కచ్చితంగా ప్రాముఖ్యత ఉండాలి.స్టార్‌ హీరోల సినిమాల్లో ఫుల్‌ ప్రియారిటీ కష్టం. అయితే కథ లో నా పాత్ర కచ్చితంగా ప్రాముఖ్యతను కలిగి ఉండాలని కోరుకుంటాను. స్క్రిప్ట్‌ బాగుండటంతో పాటు నా పాత్రకు ప్రాముఖ్యత ఉండటం ద్వారా సినిమాకు ఓకే చెప్తాను. కొన్ని సార్లు అయినా నేను చేసే సినిమాల ద్వారా సోషల్‌ మెసేజ్‌ ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటాను.ఒక వేళ మూడు కూడా నాకు అనుకూలంగా ఉంటే కచ్చితంగా ఆ సినిమాను వదులుకోను అన్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా తో పాటు తమిళంలో స్టార్‌ హీరో ధనుష్ మూవీ లో నటిస్తుంది. ఇంకా రెయిన్ బో మరియు గర్ల్‌ ఫ్రెండ్‌ తో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థం లో రెండు లేదా మూడు హిందీ సినిమాలకు ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ అమ్మది మాటలను బట్టి చూస్తుంటే చేతి నిండా సినిమాలతో ఫుల్ బీజిగా ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: