సమంత కమ్‌ బ్యాక్‌కి రెడీ అవుతుంది. ఆ మేరకు హింట్‌ ఇస్తూ వస్తోంది. ఆమె ఇటీవల సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సామ్‌ షేర్‌ చేసిన ఫోటోలు, ఆమె పోస్ట్ వైరల్‌ అవుతుంది.సమంత టాలీవుడ్‌లోని పదేళ్లపాటు ఊపేసిన నటి. స్టార్‌ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ ఇటీవల అనారోగ్యం కారణంగా ఆమె సినిమాలకు గ్యాపిచ్చింది. ఏడాది పాటు తాను రెస్ట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖుషి సినిమా తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ గ్యాప్‌లో విదేశాలు చుట్టేసింది. ఆథ్యాత్మిక జర్నీ చేసింది. పలు ఆలయాలు సందర్శించింది. మెడిటేషన్‌, ద్యానం వంటివి చేస్తూ మనసులో శాంతిని, కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందే ప్రయత్నం చేసింది.అదే సమయంలో తన అభిమానులకు టచ్‌లోనే ఉంది. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంది. వారితో చాట్‌ చేసింది. అనేక విషయాలను పంచుకుంటూనే ఉంది. సినిమాలకు దూరమైన సినిమా చుట్టూనే ఉంటుంది. ఏదోరకంగా అభిమానులను అలరిస్తుంది. ఇక తాజాగా ఆమె తన ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ తో షేర్‌ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టింది.ఇందులో బాత్‌ రూమ్‌లో దిగిన ఫోటోలు పంచుకుంది సమంత. వైట్‌ షర్ట్, బ్లూ జీన్స్ ధరించింది. మత్తెక్కించే పోజులిచ్చింది. బాత్‌ రూమ్‌లో పిచ్చెక్కించే లుక్స్ లో ఇంటర్నెట్‌ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోస్ట్ చక్కర్లు కొడుతుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేస్తుంది.ఇందులో ఆమె అన్‌బాదర్డ్ అని పేర్కొంది. బాత్‌ రూమ్‌లో ఉన్నా, తనకు ఇబ్బంది లేదని, ఇబ్బంది పడను అంటూ పేర్కొంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఆమె మేకప్‌ ఆర్టిస్ట్ ప్రీతమ్‌ జుకాల్కర్‌ కూడా స్పందించడం విశేషం. ఆమె వైట్‌ లవ్‌ ఎమోజీలను పంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

దీంతోపాటు మరో నెటిజన్ స్పందిస్తూ ఫైరింగ్‌ ఎమోజీని షేర్‌ చేస్తూ ఉఫ్‌ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి సమంత రియాక్ట్ కావడం విశేషం. ఆ నెటిజన్‌కి యూ లవ్‌ అంటూ పేర్కొంది. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ ని మరింత ఆకట్టుకుంటుంది. ఎవరికీ తలవంచని యాటిట్యూడ్‌, తాను తగ్గేదెలే అని చెప్పే యాటిట్యూడ్‌తో ఆమె పంచుకున్న ఫోటోలు, పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.సమంత చివరగా విజయ్‌ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించింది. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత సమంత చేయాల్సిన బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక సినిమాలకు బ్రేక్‌ని ప్రకటించింది. ఏడాది పాటు మూవీస్‌కి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించినట్టు వెల్లడిచింది. ఉన్న కమిట్‌ మెంట్లని కూడా ఆమె రద్దు చేసుకుంది.అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆమె పోస్ట్ లు, ఆమె సోషల్‌ మీడియాలో చేసే సందడి చూస్తుంటే సమంత మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందనిపిస్తుంది. మరి సెకండ్‌ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేస్తుంది, ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తుందనేది తెలియాల్సి ఉంది.సమంత రెండేళ్ల క్రితం మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల అనంతరం ఈ వ్యాధి ఆమెని వెంటాడింది. పర్సనల్‌ లైఫ్‌ డిస్టర్బెన్స్ తో ఆమె డిప్రెషన్‌ ఎదుర్కొంది. అది మయోసైటిల్‌ వ్యాధికి దారి తీసింది. దీని కారణంగా చాలా కుంగిపోయింది. ఆరోగ్యం పరంగా చాలా వీక్‌ అయ్యింది. చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిందని చెప్పొచ్చు. దీంతో తిరిగి పుంచుకోవడానికి చాలా టైమ్‌ పడుతుంది. ఇప్పుడు అదే పనిలో ఉంది సామ్‌. మళ్లీ ఈ అమ్మడిని వెండితెరపై ఎప్పుడు చూస్తామో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: