యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది.గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో రాబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు.
కాగా సోషల్ మీడియాలో తారక్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. అది ఏంటంటే .. ఎన్టీఆర్ వాడే ఊతపదం. ప్రతి ఒక్కరికి ఒక్కో ఊతపదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే అనేస్తు ఉంటాం. అలా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఒక ఊతపదం ఉందట. ఆయన నోటి వెంట పదే పదే ఆ పదం వస్తుందట. ‘అరే నీ…’ అని తరచుగా అంటూ ఉంటారట. ఆ మాటకు అర్థం .. అరే అది కాదు అని ఇంకో విషయం చెప్పే సందర్భంలో ఈ పదం వాడతారని సమాచారం. రోజుకు వంద సార్లు అయినా అరే నీ .. అని పలుకుతాడట

ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఆ విషయం పక్కన పెడితే.. ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చేస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రీకరణ మొదలైంది. విదేశాల్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. అలాగే ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ బెంగుళూరులో కలిశారు. వీరితో పాటు రిషబ్ శెట్టి, నిర్మాత విజయ్ కిరంగదూర్, మైత్రి రవిశంకర్ జాయిన్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: