తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తోంది.. వరుసగా సినిమాలతో వెబ్ సిరీస్ లతో దూసుకుపోతోంది తమన్నా.. మూడుపదుల వయసు దాటినప్పటికీ కూడా అదే అందాన్ని ఫిజిక్కిని మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్లకు దీటుగా అవకాశాలు అందుకుంటోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అడిగి తేడా లేకుండా వరుసగా చిత్రాలలో దూసుకుపోతోంది. ఈమధ్య బోల్డ్ సన్నివేశాలలో కూడా మరి నటిస్తోంది తమన్నా.


గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఈ విషయంపై ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వలేదు.. పలు రకాల యాడ్స్ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తోంది ఇకపోతే తమన్నా ఆధ్యాత్మిక చింతను కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అప్పుడప్పుడు పలు రకాల దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది. తాజాగా తమన్నా కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వారణాసి లోని కాశీలోని శివాలయాన్ని సందర్శించిన తమన్న ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలతో పాటు హరిహర మహాదేవనే క్యాప్షన్ కూడా రాసుకుంది.. ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్న తమన్నా.. ఆలయ సందర్శనం చాలా సింపుల్ గా జరిగింది అయితే కొన్ని రోజుల క్రితమే ప్రసిద్ధ కామాఖ్య ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయించింది తమన్నా.. అయితే తమన్నా ఇలా వరుసగా దేవాలయాలను సందర్శించడానికి ముఖ్య కారణం ఈమె జీవితంలో ఎలాంటి ఆటంకులు ఎదురవ్వకూడదని అలాగే తన అనుకున్న పనులు సాగేలా ఉండాలని ఇలా దేవాలయాలను సందర్శిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం తమన్నా కు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: