పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ తన క్రేజ్ మరింత పెరిగేలా గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. పుష్ప సీక్వెల్ మరింత హై రేంజ్ లో ఉండాలని బన్నీ కంటే దర్శకుడు సుకుమార్ కూడా చాలా గట్టిగా కష్టపడుతున్నాడనే చెప్పాలి.ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కూడా ఖర్చుకు అసలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పుష్ప 2 సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈసారి కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా పుష్ప సౌండ్ గట్టిగా వినపడాలని అనుకుంటూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా చాలా దేశాలకు వెళ్లి అక్కడ పుష్ప పేరు కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తూ ఉన్నాడు. అలాగే మరోవైపు రష్మిక కూడా ఇతర దేశాల్లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటూ అక్కడ కూడా పుష్ప 2 ఉనికిని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ప సెకండ్ పార్ట్ మాత్రం 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవాలని అల్లు అర్జున్ కోరుకుంటూ ఉన్నాడు.ఇక సుకుమార్ మైత్రి కూడా వారికి కూడా ఇది డ్రీమ్ టార్గెట్ అట.


అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2కు ఇది సాధ్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉందట. మొన్నటి దాకా సినిమా బిజినెస్ ఎలా ఉంది ఎంతవరకు వెళ్ళవచ్చు అనే విషయంలో పెద్దగా చర్చలేమీ జరగలేదు. ఇక ప్రస్తుతం మైత్రికి పుష్ప సినిమా వల్ల గట్టి ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.అయితే మైత్రి వారు కూడా డీల్స్ విషయంలో తొందరపడకుండా పక్క ప్రణాళికతో బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక థియేట్రికల్ గా అలాగే నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా దాదాపు 700 కోట్ల దాకా బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమం టాక్ అందుకున్న కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం 1000 కోట్లు పక్కా..మరి చూడాలి ఈ ఈ డ్రీం మార్క్ అందుకుంటుందో లేదో.. పుష్ప 1 350 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగులో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా హిందీలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: