తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి యమున అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.అలాంటి నటి యమున రామోజీరావు నిర్మాణ సారథ్యంలో వచ్చిన మౌన పోరాటం చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ చిత్రాలలో బుల్లితెర సిరియళ్లలో కూడా నటించి ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె ఎంత త్వరగా పేరు తెచ్చుకుందో, అంతే త్వరగా కేసు వల్ల పేరు నాశనమైంది. అయితే ఆమె బ్రో*ల్ కేసులో అరెస్ట్ అయి అనేక ఇబ్బందులు పడిందట. మరి నిజంగానే యమునా అలాంటి పని చేసిందా. లేదంటే కావాలని ఇరిగించారా.?అనే దానిపై యమున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే యమునా బెంగళూరులోని ఐటీసీ గార్డెన్ హోటల్లో పట్టుబడిందని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. అయితే ఆమెపై పెట్టిన కేసు వ్య*చారం చేస్తూ పట్టుబడిందని ఆరోపణలు చేశారు. కానీ యమునా అలాంటి పని చేయలేదట. ఒకవేళ చేసి ఉంటే ఐదు సంవత్సరాలు కోర్టులో పోరాడే దాన్ని కాదని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. నేను అక్కడికి వెళ్ళింది సిసిబి ఆఫీస్ కు మాత్రమే అని అన్నది. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే అంతగా ఫైట్ చేసి ఏడ్చాను. అయితే యమునను సిసిబి ఆఫీస్ కి ఒక ఎంక్వయిరీ ఉందని పిలిచారట. ఆమె వెళ్లి డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత కావాలని కొంతమంది ఇరికించి కేసు పెట్టారు.

నేను అరెస్ట్ అయిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత నాపై పెట్టిన కేసులన్నీ అబద్దాలని ఒక్కొక్కటిగా బయటపడింది. నన్ను అరెస్టు చేసినందుకు పోలీసులు ఏది కూడా ప్రూవ్ చేయలేకపోయారు. చివరికి కోర్టు నుంచి నేను ఏ తప్పు చేయలేదని ఆర్డర్ కూడా వచ్చిందని చెప్పారు యమున. అయితే ఈ కేసులో ఆమెను కొంతమంది కావాలని ఇరికించారని, దానివల్ల నేను కొన్నాళ్లపాటు ఎంతో బాధపడ్డానని, చివరికి మా నాన్నకు కూడా దూరమయ్యారని, ఆ సమయంలోనే ఆయన మరణించారని ఆ బాధ నేను చెప్పుకోలేనిదంటు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యమునా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: