స్టార్ హీరోల మధ్య .. వారి అభిమానుల మధ్య కోల్డ్ వార్ లు.. డైరెక్ట్ వార్ లు కామన్.. సినిమాల వల్ల, డైరెక్టర్ ల వల్ల కూడా ఒక్కోసారి గొడవలు జరుగుతుంటాయి.కొన్ని కొన్ని మాత్రం రూమర్స్ గా మిగిలిపోతుంటాయి.హీరోల మధ్య కోల్డ్ వార్ లు..అభిమానుల మధ్య డైరెక్ట్ వార్ లు..నెటిజన్ల మధ్య సోషల్ మీడియా వార్లు ఎప్పుడూ జరుగుతుండేవే. కాని చాలా వరకు స్టార్ హీరోలు అంతా మంచిగా ఉండటానికే ఇష్టపడుతుంటారు. ఫ్యాన్స్ ను కూడా వారిస్తుంటారు. కాని కొన్ని విషయాలు మాత్రం సోషల్ మీడియాను శేక్ చేస్తుంటాయి. అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇద్దరు స్టార్ హీరోల మధ్య దర్శఖుడు పూరీ జన్నాథ్ వల్ల గొడవ జరిగిందట.టాలీవుడ్ అనే కాదు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో.. ఒక స్టార్ చేయాల్సి సినిమా మరో స్టార్ దగ్గరకు వెళ్లడ.. హిట్టో ఫట్టో అవ్వడం జరిగేదే. ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను ఆ స్టార్ హీరో ఓకే చెప్పి ఆ తర్వాత డైరెక్టర్ మరొక హీరోతో తెరకెక్కించడం రేర్ గా జరుగుతూ ఉంటుంది. అవి కాస్త వివాదాలు అవుతుంటాయి. అలాంటి సందర్భంలోనే ట్రోల్స్ కు గురయ్యాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా..సొంత కష్టం మీద టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్ బాబు. భారీగా పాపులారిటీని చాలా తక్కువ టైమ్ లో సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఇక ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో బిజినెస్ మాన్ కూడా ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. యూత్ కు కిక్క్ ఇచ్చింది. ఖాళీగాఉండేవారికి చురకలంటించినంత పని చేసింది.

అంతే కాదు మహేష్ బాబు లో మరో కోణాన్నిబయటకు తీసింది. మాస్ తో పాటు.. మహేష్ బాబు చేత కూడా బూతు డైలాగులు చెప్పించాడు పూరి. అయితే అసలు విషయం ఏంటంటే.. ? ఈసినిమాను ముందుగా తమిళ స్టార్ హీరో సూర్య కోసం అని అనుకున్నారట పూరి జగన్నాథ్. అంతే కాదు ఈ కథను ఆయన వినిపించాడట కూడా. కథ బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. త్వరలో అగ్రిమెంట్ రాసుకుందాం అన్నాడట.అయితే అక్కడ ఓ మార్పు జరిగింది. ఈ కథను కోలీవుడ్ హీరోతే చేస్తూ.. టాలీవుడ్ లో అంత బాగా మార్కెట్ అవుతుందో లేదో.. మన టాలీవుడ్ హీరో అయితే బాగుంటుంది.. అందులో మహేష్ బాబు అయితే ఇంకా బాగుంటుంది అన.. పూరీ ఫ్రెండ్ఎవరో గట్టిగా చెప్పారట. దాంతో పూరీ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. వెంటనే మహేష్ బాబుకు పూరీ కథ చెప్పడం.. ఈ కథ వినగానే వెంటనే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసేశాడట సూపర్ స్టార్ .ఈ విషయంలో సూర్య కాస్త హర్ట్ అయ్యారని సోషల్ మీడియాలో వినిపించిన గాసిప్.. అధికారికంగా తెలియదు కాని.. సూర్య హార్ట్ అయ్యేవరకూ.. ఆయన ఫ్యాన్స్ కూడా హార్ట్ అయ్యారట. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది . పూరి జగన్నాథ్ చేసిన తప్పు పై అప్పట్లో సూర్య ఫ్యాన్స్ కూడా... మండిపడటంతో పాటు.. ఇండైరెక్ట్ గా మహేష్ బాబు ను ట్రోల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: