బాలీవుడ్ ప్రేమ జంట జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు.ఫిబ్రవరి 21న ఏడడుగులు వేసేసారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రకుల్ సందడి చేస్తున్నారు.తాజాగా ఒక డాన్స్ రీల్ చేసి నెట్టింట వైరల్ అవుతున్నారు. పెళ్లి తరువాత భర్తతో కలిసి తొలిసారి ఇన్‌స్టా డాన్స్ రీల్ చేశారు రకుల్ ప్రీత్. అయితే ఈ డాన్స్ రీల్ ఒక ఛాలెంజ్ లో భాగంగా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా 'బడే మియా ఛోటే మియా'. ఈ మూవీ నుంచి ఇటీవల 'మస్త్ మలంగ్ ఝుమ్' అనే పాటని రిలీజ్ చేశారు.ఆ పాటని ఇన్‌స్టా రీల్ తో టైగర్ ష్రాఫ్ రీ క్రియేట్ చేసి.. బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, రకుల్, జాకీ భగ్నానీ అండ్ తన ఫ్యాన్స్ కి ఛాలెంజ్ ఇచ్చారు. ఆ పాటలోని స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ రీల్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక టైగర్ ఇచ్చిన ఛాలెంజ్ ని అంగీకరిస్తూ.. రకుల్ అండ్ జాకీ కలిసి ఆ డాన్స్ వీడియో చేశారు. కొత్త జంట కొత్త పాటకి స్టెప్పులు వేస్తుంటే నెటిజెన్స్ ఫిదా అయ్యిపోయారు. మరి ఆ డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్ వేసేయండి.ఇది ఇలా ఉంటే, ఈ సాంగ్ లో అక్షయ్ అండ్ టైగర్ వేసిన స్టెప్పులు.. 'నాటు నాటు' పాటకి రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు మాదిరి ఉన్నాయంటూ కొందరు నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. నాటు నాటు స్టెప్ నే కొద్దిగా అటుఇటుగా మార్చి 'బాస్కో-సీసర్' ఈ పాటకి కోరియోగ్రఫీ చేసేసారు. అయితే ఈ పాటలోని స్టెప్స్ మాత్రమే కాపీ కాదు, సాంగ్ ట్యూన్ కూడా కాపీనే అంటున్నారు నెటిజెన్స్. విశాల్ మిశ్ర కంపోజ్ చేసిన ఈ పాట వింటుంటే.. తమన్నా 'కావాలి' సాంగ్ గుర్తుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: