![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle74eea8ac-7054-403c-97a5-319cc6d264dd-415x250.jpg)
గతంలో కీర్తి సురేష్ కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో చెల్లి పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా ఆమె కెరియర్ కి ఉపయోగపడకపోగా మైనస్ అయింది. ఇప్పుడు తెలిసి కూడా వైష్ణవి చైతన్య అలాంటి ప్రయోగం చేయబోతుందట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఆ చిత్రానికి స్పిరిట్ అనే పేరును కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ సినిమాలో ప్రభాస్ కి చెల్లి పాత్ర కోసం అనేక మంది హీరోయిన్స్ ని పరిశీలించినప్పటికీ వైష్ణవి చైతన్య బాగుంటుందని డైరెక్టర్ అనుకుంటున్నాను. మరి ఇలాంటి సినిమా కోసం హీరోయిన్ కాస్త చెల్లి అయిపోతే ఆ తర్వాత మళ్లీ హీరోయిన్ పాత్రలు రావడం ఎంత వరకు సాధ్యం అనేది ఆలోచించుకోకుండానే వైష్ణవి తప్పు చేస్తుందా ? దీని గురించి పూర్తి అప్డేట్స్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.