టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో విజయ్ కి జోడీగా నటిస్తోంది. ఇకపోతే ఇది వరకే విజయ్ , పరుశురామ్ కాంబోలో గీత గోవిందం అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. దానితో వీరి కాంబో లో రూపొందుతున్న రెండవ మూవీ పై ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ సాంగ్ ను విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. మొదట ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ బృందం వారు నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ టీజర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని క్యూట్ అండ్ క్లాస్ సన్నివేశాలను కూడా ఈ చిత్ర బృందం చూపించింది. ఇక మొత్తంగా ఈ సినిమా టీజర్ లో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ , బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే మృణాల్ చాలా తక్కువ సమయం ఈ టీజర్ లో కనిపించిన ఆమె కూడా బాగానే ఆకట్టుకుంది. మొత్తంగా ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd