మెగాస్టార్ చిరంజీవి , విజయ్ దేవరకొండ , నితిన్ హీరోలుగా రూపొందుతున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలో హీరో గా నటిస్తున్నారు ..? ఆ మూవీ లకు సంబంధించిన సినిమా షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి ..? ఈ మూవీ బృందాలు ఈ సినిమాలకు సంబంధించిన ఈ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి పూట ఓ సాంగ్ సన్నివేశాన్ని చిత్రికరిస్తున్నారు. ఇ ఇకపోతే ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయ్ మరియు మృనాల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ యువ నటుడు నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నితిన్ పై ఈ మూవీ కి సంబంధించిన ఇంటర్వల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: