టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కంటే ముందే మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబోలో పోకిరి అనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ రూపొందింది. అలా పోకిరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా కావడంతో బిజినెస్ మాన్ మూవీ పై మొదటి నుండి సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ మొదట మహేష్ బాబు కు కాకుండా మరో హీరో కి వినిపించాడట. ఆ హీరో రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాను మహేష్ బాబు తో రూపొందించాడట. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబై గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో ఓ కథను రాసుకో అని పూరి జగన్నాథ్ కు సలహా ఇచ్చాడట. దానితో పూరి "బిజినెస్ మాన్" మూవీ కథను తయారు చేశాడట. ఆ కథను తమిళ నటుడు సూర్య కి వినిపించాడట. కథ మొత్తం భిన్న సూర్య కథ బాగానే నచినప్పటికీ ఆ సమయంలో వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో ఈ సినిమాను నేను చేయలేను సార్ అని చెప్పాడట. దానితో ఆ తర్వాత ఈ కథను మహేష్ కి పూరీ చెప్పడం ... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. దానితో ఇది బిజినెస్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: