ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తనకు ఇటీవల కాలంలో తిండి పిచ్చి బాగా ఎక్కువైపోయిందని తెలిపారు. పప్పు చారు అన్నం చాలా ఇష్టంగా తింటానని తెలిపారు. ఇకపోతే డబ్బులు దాచుకొని మరి తాను వెకేషన్ వెళ్తున్నానని ఈమె తెలియజేశారు. నేను ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందుగా ప్లాన్ వేసి చేయనని అప్పటికప్పుడు నాకు ఏమి నచ్చితే అదే పని చేస్తానని తెలిపారు. ఇక నాకు సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టం . ఇక నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా అని డైరెక్ట్ గా సినిమాల్లోకి వెళ్లడానికి ఇష్టపడనని నన్ను కూడా ఆడిషన్ కి పిలిస్తే చాలా సంతోషంగా వెళ్తానని తెలిపారు. ఇకపోతే ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. కానీ నాకు కమర్షియల్ సినిమాలు రాలేదని, అలాంటి సినిమాలలో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. ఇకపోతే ఈ కుకింగ్ షోలో భాగంగా తన నాన్నమ్మ, అలాగే పెద్దమ్మ సురేఖ తో పాటు వదిన ఉపాసన ని కూడా తీసుకువచ్చి వారి చేత వంట వండించాలని అనుకుంటున్నాను. అయితే ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి