నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కొంత కాలం క్రితం అఖండ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఫాంటసీ , యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా గాను , రైతుగాను రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీకాంత్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకు కొనసాగింపుగా "అఖండ 2" మూవీ ఉండబోతుంది అని ఇది వరకే ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ... అలాగే ఈ మూవీ హీరో బాలకృష్ణ పలుమార్లు చెప్పుకు వచ్చారు. ఇకపోతే ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సినిమాకు సంబంధించిన కథ పనులను కూడా ముగించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులను మరికొన్ని రోజుల్లో బోయపాటి శ్రీను పూర్తి చేసుకుని నవంబర్ నెలలో "అఖండ 2" సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అనే ఆలోచనలో ఈ మాస్ దర్శకుడు ఉన్నట్లు ... అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ ఏ బ్యానర్ లో రూపొందిపోతుంది అనే విషయంపై మాత్రం పెద్దగా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: