టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ఆఖరుగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ యువ నటుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈయన ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టాడు. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో జీవితంలో చాలా విషయాలలో అడ్జస్ట్ కావాలి అని తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో విజయ్ మాట్లాడుతూ ... నేను నా చిన్న వయస్సు నుండి జీవితంలో అడ్జస్ట్ అవడం నేర్చుకున్నాను. నేను స్కూల్ కి వెళ్తున్న రోజుల్లో మా నాన్నను సైకిల్ కొనివ్వమని అడిగాను. ఆయన బర్త్ డే కి కొంటాను అని ... సెలవుల్లో కొంటాను అని సాగదీసి చాలా రోజులకు ఎప్పుడో కొనిచ్చాడు. ఆ తర్వాత వీడియో గేమ్ , కంప్యూటర్ , టీవీ ఇలా చాలా విషయాల్లో నేను చిన్న తనంలో అడ్జస్ట్ అయ్యాను. చిన్న వయసులో మాత్రమే కాదు ఇప్పటికే కూడా అనేక విషయాలలో అడ్జస్ట్ అవుతూ జీవితాన్ని సాగిస్తున్నాను అని విజయ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: