తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే తన యాక్టింగ్ తో మాత్రమే కాదు తన యాటిట్యూడ్ తో కూడా యూత్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. అయితే ఇటీవల కాలంలో విజయ్ నటిస్తున్న సినిమాలు అటు బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపిస్తున్నాయి. లైగర్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సమంతతో కలిసి ఖుషి అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.


 ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఎంత మంచి విజయాన్ని సాధించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది అని ఒక టాక్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఒక ఫ్యామిలీ మ్యాన్ పడే కష్టాలను ఈ సినిమాలో చూపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. అయితే అక్కడక్కడ మాత్రం కలెక్షన్స్ కాస్త తగ్గాయని టాక్ వినిపిస్తోంది.


 ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు ఈ రౌడీ హీరో. గౌతం తిన్ననూరితో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారో అనే విషయంపై గత కొంతకాలంగా కొంతమంది పేర్లు తెరమీదకి వచ్చాయి. కాగా ఇప్పుడు ఒక క్రేజీ హీరోయిన్ ఈ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ప్రేమలు అనే సినిమాతో ఇటీవల సూపర్ హిట్ కొట్టిన మమిత బైజు విజయ్  సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: