ఈ ఏడాది ప్రథమార్ధం పూర్తవనే లేదు. ద్వితీయార్ధం మీద బోలెడు హోప్స్ ఉన్నాయి. అయినా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే లు మాత్రం.. అప్పుడే జనాల్లో ఇంట్రస్ట్ పెంచేస్తున్నాయి.
2025 సంక్రాంతికి మేం రావడం పక్కా అని ఢంకా భజాయించి చెప్పేసింది విశ్వంభర టీమ్‌.లాస్ట్ ఇయర్‌ వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్‌ దగ్గర గలగలలు బాగా నే విన్న చిరు, 2024 పొంగల్‌ని మిస్‌ చేసుకున్నారు. అందుకే వచ్చే ఏడాది రావడం పక్కా అని చాలా ముందుగానే, స్ట్రాంగ్‌ గా చెప్పేశారు.సంక్రాంతికి లాస్ట్ ఇయర్‌ చిరుతో పాటే వచ్చారు నందమూరి బాలకృష్ణ. 2024 పొంగల్‌ సీజన్‌ని ఆయన కూడా మిస్‌ చేసుకున్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్‌ ఎండింగ్‌ లో వచ్చిన భగవంత్‌ కేసరి వైబ్స్ కాస్త ఆ లోటుని తీర్చాయనుకోండి. నందమూరి అభిమానులు సంక్రాంతి ఫెస్టివ్‌ వైబ్‌ని మిస్‌ చేసుకోవడం బాలయ్య కు ఇష్టం లేదట. అందుకే నెక్స్ట్ ఇయర్‌ సంక్రాంతి కి నేనూ వస్తానంటున్నారు నందమూరి నట సింహం.ఈ అక్టోబర్‌ లో విడుదల కావాల్సిన బాబీ పోస్ట్ పోన్‌ అయి, వచ్చే ఏడాది సంక్రాంతి కి వస్తుందన్నది ఇప్పుడు ట్రెండింగ్‌ టాపిక్‌. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. కాబట్టి, ఏపీ ఎన్నికల మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు బాలయ్య. బాబీ కు కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఆఫ్టర్‌ ఎలక్షన్స్.. బాలయ్య షూటింగ్‌ పూర్తి చేసి, సంక్రాంతి కి రిలీజ్‌ చేయాలన్నది బాబీ ప్లాన్‌.చిరు - బాలయ్య మధ్య సంక్రాంతి పోటీ అనగానే ఇది ఎన్నోసారి అంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. సినీ ఇండస్ట్రీ కి ఖైదీ నెంబర్‌ 150 తో రీ ఎంట్రీ ఇచ్చారు చిరు. అప్పుడు గౌతమీ పుత్ర శాతకర్ణి తో సంక్రాంతి రేసులో ఢీకొట్టారు బాలకృష్ణ. రీఎంట్రీ కన్నా ముందు కూడా వీరిద్దరూ చాలాసార్లు పోటీపడ్డారు. ఆ లను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: