మెగా డాటర్ నిహారిక  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే హాట్ టాపిక్ గా మారుతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్ట్ చూసిన సదరు నెటిజన్లో ఆమె మళ్ళీ ప్రేమలో పడింది అంటూ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నిహారిక తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అయితే నిహారిక  తన భర్తతో ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.

 2020లో చైతన్య తో వివాహం చేసుకున్న నిహారిక 2023లో విడాకులు తీసుకుని విడిపోయింది. అయితే వీరిద్దరిదీ పెద్దలు కుదిరిచిన సంబంధం. బంధుమిత్రుల సమక్షంలో రాజస్థాన్లోని ఉదయపూర్ పాలస్లో అంగరంగ వైభవంగా విడుదల వివాహాన్ని నిర్వహించాడు నాగబాబు. కానీ అనూహ్యంగా రెండు సంవత్సరాలు కూడా కలిసి ఉండకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక పెళ్లయిన తర్వాత నిహారిక పూర్తిగ సినిమాలకి దూరమైంది. కానీ విడాకుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగా కూడా బిజీగా ఉంది.

 పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై పలు సినిమాలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ను నిర్మిస్తోంది. దాంతోపాటు ఓటీటీ లో సైతం చెఫ్ మంత్ర పేరుతో ఒక ప్రోగ్రాం కి హోస్టు గా కూడా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటో ఒకటి ఆసక్తి రేకెత్తిస్తోంది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో .. ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకుని ప్రేమగా చూసుకుంటున్న ఫొటోకు, రెడ్ కలర్ లవ్ సింబల్ జత చేసి పెట్టింది. ఇది చూసిన వారంతా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందంటూ చర్చించుకుంటున్నారు. మరి కొందరు ప్రేమ లాంటిది ఏమీ లేదని .. నిహారికకు జంతువులు అంటే ప్రేమ. ఆ పోస్ట్ వెనకున్న భావన అదే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: