వరుస అపజయాలతో డీలా పడిపోయిన మ్యాచో స్టార్ గోపీచంద్ ... టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తి అయినప్పటికీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ మూవీ యూనిట్ "వైట్ల మ్యాచో" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా యొక్క షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ రోజు ఈ సినిమా నుండి "ది ఫస్ట్ స్ట్రైక్" అనే పేరుతో ఓ వీడియోను సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ వీడియో పై గోపీచంద్ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ వీడియో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. ఒక వేళ ఈ మూవీ బృందం వారు విడుదల చేసే ప్రచార చిత్రాలు కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే ఈ సినిమాపై ఆటో మేటిక్ గా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. గోపీచంద్ తాజాగా హర్ష దర్శకత్వంలో రూపొందిన బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా గోపీచంద్ కు విజయం అందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc