గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ని షేక్ చేశాడు అని చెప్పడం లేదు ఎటువంటి సందేహం లేదు. మంచి హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఏడాది సంక్రాంతికి మాత్రం మిస్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అందుకే వచ్చేది సంక్రాంతికి కొత్త సినిమాతో రావడం పక్కా అని ముందుగానే చెప్పేసారు. అయితే గత ఏడాది చిరంజీవితో పాటు నందమూరి బాలకృష్ణ సైతం పొంగల్ రేస్ లో నిలిచారు. ఇక 2024 లో సంక్రాంతి కానుకగా ఆయన కూడా తన సినిమాని మిస్ చేసుకున్నాడు. కాకపోతే గత ఏడాది చివరిలో వచ్చిన భగవంతుకేసరి

 సినిమాతో ఆ లోటు కాస్త తీరింది అని చెప్పొచ్చు. కానీ నందమూరి అభిమానులు మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి ఒక సినిమా రావాలి అంటూ బాలయ్యను కోరుకుంటున్నారు. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా నందమూరి అభిమానుల ముందుకి ఒక సినిమాతో రావాలి అని బాలయ్య ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ అక్టోబర్ లో విడుదల కావలసిన బాబి బాలయ్య సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యింది.  సంక్రాంతికి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కాబట్టి ఏపీ ఎన్నికలపై దృష్టి పెట్టారు బాలయ్య.

బాబీ కు కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఆఫ్టర్‌ ఎలక్షన్స్.. బాలయ్య షూటింగ్‌ పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్నది బాబీ ప్లాన్‌.  చిరు - బాలయ్య మధ్య సంక్రాంతి పోటీ అనగానే ఇది ఎన్నోసారి అంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. సినీ ఇండస్ట్రీకి ఖైదీ నెంబర్‌ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు చిరు. అప్పుడు గౌతమీ పుత్ర శాతకర్ణితో సంక్రాంతి రేసులో ఢీకొట్టారు బాలకృష్ణ. రీఎంట్రీకన్నా ముందు కూడా వీరిద్దరూ చాలాసార్లు పోటీపడ్డారు. ఆ లను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: