సాధారణంగా సినిమా హీరో హీరోయిన్ల లైఫ్ ఎంతో లగ్జరీగా ఉంటుంది. ఇక సినిమాల్లో  నటించినందుకు కోట్ల రూపాయలు తీసుకుంటారని అందరూ అనుకుంటూ ఉంటారు  కానీ సిని సెలబ్రిటీల లైఫ్ ఊహించినంత సులభంగా ఉండదు అని కొంతమందిని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏకంగా సినిమా కోసం ప్రాణం పెడుతుంటారు కొంతమంది నటీనటులు. ఇక పాత్రకు తగ్గట్లుగా తమను తమను మార్చుకోవడం చేస్తూ ఉంటారు.  తమ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా ఎన్నోసార్లు రిస్క్ చేస్తూ ఉంటారు.


 కొంతమంది  పాత్ర కోసం భారీగా బరువు పెరిగిపోతుంటే.. ఇంకొంతమంది  భారీగా బరువు తగ్గి బక్క చిక్కిపోవడం కూడా చూస్తూ ఉంటాం   మొన్నటికి మొన్న ఆడు జీవితం సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్  20 కిలోలకు పైగా బరువు తగ్గినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక సినిమాలో పృధ్విరాజ్ ను చూసి అభిమానులు సైతం షాక్ అయ్యారు. అయితే బాలీవుడ్ యాక్టర్ రణదీప్ కూడా సైతం గత కొంతకాలం నుంచి ఇదే విషయంలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. ఏకంగా ఒక మూవీ కోసం ఎవరు ఊహించని విధంగా మారిపోయాడు. అతనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అతని అభిమానులే అతని గుర్తుపట్టలేనంతగా రూపురేఖలు మారిపోయాయి. స్వాతంత్ర వీర్ సవర్కర్ అనే మూవీ కోసం ఇలా బక్క చిక్కిపోయాడు బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా. అయితే ఇలా భారీగా బరువు తగ్గడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వార్థంత్ర వీర్ సావర్కర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను   సావర్కర్ పాత్ర కోసం ఏకంగా 26 కేజీలకు పైగా బరువు తగ్గాను. అందుకోసం రోజు ఒక ఖర్జూర పండు, గ్లాసు పాలు మాత్రమే తీసుకునే వాడిని. ఆ సమయంలో చనిపోతానేమో అనే భయం కూడా వేసేది అని రణదీప్ హుడా చెప్పుకొచ్చాడు. అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వాతంత్ర వీర్ సావర్కర్ అనే మూవీ యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: