టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించగా... పరశురామ్ పెట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజే ఘోరమైన నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. దానితో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్ లపై పడింది. మొదటి రోజు పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత చాలా తక్కువ మొత్తంలో కలక్షన్ లు వస్తున్నాయి. ఈ సినిమాకు కొంత మంది కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు.

ఆ కారణంతో ఈ సినిమా కలెక్షన్ లు కూడా తగ్గాయి అని విజయ్ పోలీసులను సంప్రదించి కొంత మంది పై కేసు పెట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఓ మీడియా వ్యక్తి విజయ్ తో మీరు నటించిన "ది ఫ్యామిలీ స్టార్"  సినిమాకు కొంత మంది కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని ఆ కారణంతో మీరు కొంత మందిపై పోలీసులకు కంప్లైంట్ చేశారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అది నిజమేనా అని ప్రశ్నించాడు.

దానికి విజయ్ స్పందిస్తూ ... అది పూర్తిగా అబద్ధపు వార్త. నేను "ది ఫ్యామిలీ స్టార్" మూవీ కి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు అని కంప్లైంట్ ఇచ్చేందుకు ఏ పోలీసులను కలవలేదు. ఎవరిపై కంప్లైంట్ ఇవ్వలేదు. కోవిడ్ సమయంలో అప్పటి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తో ఉన్న ఒక ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ తాజాగా వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: