బ్యూటిఫుల్ నటిమని అంజలి తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ 2014వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన గీతాంజలి మూవీకి కొనసాగింపుగా రూపొందింది. ఇక గీతాంజలి మూవీకి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో మొదటి నుండి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు అనగా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అంజలి మాట్లాడుతూ ... నేను ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాను. ఈ మూవీలో నా పాత్ర చాలా టిపికల్ గా ఉంటుంది. శంకర్ గారు నాకు ఒక అద్భుతమైన పాత్రను రాశారు. రాయడం మాత్రమే కాకుండా అంతకుమించిన లెవల్లో ఆ పాత్రను వెండితెరపై చూపించబోతున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అనే నమ్మకం నాకు ఉంది అని అంజలి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ మూవీని ఈ సంవత్సరం అక్టోబర్ చివరలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కనుక సూపర్ సక్సెస్ అయినట్లు అయితే అంజలి కి కూడా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: